భార్య‌ను సుత్తితో కొట్టి చంపి.. డ‌బ్బా త‌గిలింద‌ని భ‌ర్త డ్రామా!

క‌లం, వెబ్ డెస్క్‌: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ భ‌ర్త త‌న భార్య‌ను సుత్తి (Hammer)తో కొట్టి చంపేశాడు. ఎవ్వ‌రికి అనుమానం రాకుండా డ‌బ్బా త‌గిలి చ‌నిపోయింద‌ని న‌టించాడు. ఈ ఘ‌ట‌న హయత్‌న‌గ‌ర్ (Hayathnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే స‌ద‌రు భార్యాభ‌ర్త‌ల‌కు త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉంటాయి. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి బాధితురాలికి త‌న భ‌ర్త‌తో వాగ్వాదం జ‌రిగింది. భ‌ర్త‌ క్ష‌ణికావేశానికి గురై భార్య‌ను సుత్తితో కొట్టి చంపేశాడు. దీంతో మ‌హిళ‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఆ త‌ర్వాత భ‌ర్త‌ పెయింట్ డబ్బా తల మీద పడిందని డ్రామా ఆడి భార్య‌ను యశోదా ఆస్పత్రికి తరలించాడు. అయితే కూతుర్ల ఫిర్యాదుతో అస‌లు నిజం వెలుగులోకి వ‌చ్చింది. త‌మ త‌ల్లిని తండ్రి సుత్తితో కొట్టాడ‌ని కూతుర్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>