Mobile Popup Ad
Mobile Popup Ad

ఫ్రీ బ‌స్సు తీసేయండి.. సీఎం రేవంత్‌కు కుమారి ఆంటీ రిక్వెస్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌ (Hyderabad)లో త‌న చిన్న‌ ఫుడ్ బిజినెస్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ (Kumari Aunty) తాజాగా మ‌రోసారి త‌న కామెంట్ల‌తో వైర‌ల్‌గా మారారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్రారంభించిన ఫీ బ‌స్సు (Free Bus)పై కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దయచేసి ఫ్రీ బస్సు తీసెయ్యండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కుమారి ఆంటీ రిక్వెస్ట్ చేశారు. ఫ్రీ బస్సు వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్య‌క్తం చేశారు. ఇండ్లల్లో చిన్న గొడవలైనా మ‌హిళ‌లు బస్సు ఎక్కి వెళ్లిపోతున్నార‌ని చెప్తున్నారు. ఆఖరికి మహిళలే ఒకరినొకరు కొట్టుకుంటున్నారని వెల్లడించారు. ఈ ఫ్రీ బ‌స్సు వ‌ల్ల చాలామందితో పాటు తాను కూడా ఇబ్బంది పడ్డానని, ఫ్రీ బస్ తీసెయ్యాల‌ని కుమారి ఆంటీ చెప్పారు. ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు డ‌బ్బులు ఆదా చేస్తున్నామ‌ని చెప్పుకుంటున్న ఫ్రీ బ‌స్ స్కీంపై కుమారి ఆంటీ ఇలాంటి కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>