ఏపీలో ఇంధన కొరతపై మంత్రి కీలక సమీక్ష

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఇంధన కొరత (Fuel Shortage) తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష చేశారు. ఇంధనాన్ని పక్కదోవ పట్టించే వారిపై.. స్టాక్ ఉన్నా, లేదని చెప్పే బంకులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బంకుల్లో రేషన్ పద్ధతిని కొనసాగించాలని సూచించారు. ఆక్వా, వరి రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలన్నారు. బంకుల మూసివేత తగ్గిందని.. కంపెనీల నుంచి సరఫరా పెరిగిందని ప్రకటించారు. ఇంధనం సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

ఎక్కడా చూసినా వాహనాల బారులు..

పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా మంగళవారం నాడు కూడా పలు చోట్ల పెట్రోల్ బంకుల ఎదుట వాహనాలు బారులు తీరుతూ కనిపించాయి. పల్నాడు జిల్లాలో నిబంధనలు పాటించని మూడు పెట్రోల్ బంకుల్ని కలెక్టర్ కృతికా శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేట శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలోని తిరుమల ఫిల్లింగ్ స్టేషన్‌, చిలకలూరిపేటలోని జనతా ఫిల్లింగ్ స్టేషన్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>