ఏ టైంలో గోల్ కొట్టాలో బీఆర్ఎస్‌కు బాగా తెలుసు: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ నడిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ సభా నియమాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు చెక్ ఇచ్చేందుకు 3 గంటలు సభను వాయిదా వేశారని అన్నారు. ప్రతి రోజు జీరో అవర్ తీసుకుంటామని చెప్పి, రెండు రోజుల నుంచి జీరో అవర్ తీసుకోవడం లేదని మండిపడ్డారు. తల క్రింద పెట్టి కాలు పైకి పెట్టినా.. రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాలేడని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ అని, కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

సౌత్ ఇండియాకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ తక్కువగా వస్తున్నాయని హరీశ్ రావు అన్నారు. దక్షిణాదిపై కేంద్రానికి చిన్నచూపు ఉందని, ఇదే విషయాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తూనే ఉందన్నారు. డిలిమిటేషన్‌ను బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందని, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభమేనని చెప్పారు. ఏ టైంలో గోల్ కొట్టాలో బీఆర్ఎస్‌కు బాగా తెలుసు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తప్పకుండా గోల్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పారు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్‌రెడ్డే పోటీ చేయాలని హరీశ్ రావు డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో పోటీకి ఆయన్ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల సిద్దిపేట జిల్లా నర్మెట సభలో ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్‌ గెలవాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా హరీశ్ రావు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>