Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి: హరీష్ రావు

కలం, మెదక్ బ్యూరో: అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి రైతులను మోసపుచ్చుతూ నాటకాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. రాష్ట్రంలో వడ్లు, మక్కలు, సన్ ఫ్లవర్, శనగలు, జొన్నల కొనుగోలు బాధ్యతను విస్మరించి కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై నెపం నెడుతున్నారని ఆరోపించారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా, ఇక్కడ బీజేపీ నాయకులు వడ్లు కొనాలంటూ ధర్నాలు చేయడం వారి ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ఆయన ఫైర్ అయ్యారు. సిద్దిపేట (Siddipet) జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను హరీశ్ రావు సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా సేకరించే కోటాను, ఎరువుల కోటాను రాష్ట్రానికి సకాలంలో ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇద్దరూ కలిసి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీలు ఇక్కడ ధర్నాలు చేయడం కాదు.. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కోటా పెంచేలా కొట్లాడాలని హితవు పలికారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించి కలెక్టర్లు, తహశీల్దార్లు, డీఆర్డీఏ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.

Read Also: నిజామాబాద్ నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>