epaper
Sunday, February 22, 2026
epaper

నిరుద్యోగులకు హరీశ్ రావు గుడ్ న్యూస్.. ఆ యాప్‌తో ఉద్యోగ అవకాశాలు

క‌లం, మెద‌క్ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. నిరుద్యోగుల‌కు ఉప‌యోగప‌డే ఎన్నో ఫీచ‌ర్స్‌తో ఉద్యోగ యాప్‌ను రూపకల్పన చేశారు. సిద్ధిపేట నియోజకవర్గవ్యాప్తంగా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారికి “హరీశ్ అన్న ఉద్యోగ యాప్” (Harish Anna Udyoga App)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్ విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 57 రకాల పోటీ పరీక్షలకు సిల‌బ‌స్ సిద్ధంచేసి తయారుచేశారు. ఇందులో 2 వేల గంటల వీడియో రికార్డింగ్ పాఠాలు, 400 నమూనా ప్రశ్నాపత్రాలు ఉంటాయి.

గతంలో గ్రూప్1, గ్రూప్ 2 పోలీస్ కానిస్టేబుల్, టెట్, ఉపాధ్యాయ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు హరీశ్ రావు ఉచితంగా కోచింగ్ ఇప్పించారు. దీంతో అనేక మంది ఉద్యోగ అవకాశాలను దక్కించుకున్నారు. యువతకు ఆర్థిక భారం కాకూడదనే కారణంతో ఈ యాప్‌ను తీసుకొచ్చారాయన. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివినవారికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడనుంది.

యాప్‌లో ఏముంటాయి

వివిధ స‌బెక్టుల‌కు సంబంధించిన 4 వేల స్టడీ మెటీరియల్, పీడీఎఫ్ ఉంది. ఇది ఏడాది మొత్తం అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ కోచింగ్ సెంట‌ర్ల త‌ర‌హాలో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేలా టెస్టుల‌ను సైతం నిర్వహించనున్నారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. కేవ‌లం స్టడీ మెటీరియ‌ల్, టెస్టుకే కాకుండా.. నిపుణులైన ఫ్యాకల్టీతో సందేహాల నివృత్తికి సమయాన్ని నిర్దేశిస్తారు. రీజనింగ్, ఆంగ్లం, కరెంట్ అఫైర్స్, చరిత్ర, రాజనీతి, ఆర్థిక, భౌగోళిక తదితర సబ్జెక్టుల పాఠాలు ఉంటాయి. తెలుగులోపాటు ఇంగ్లీషులోనూ పాఠాలు వినొచ్చు. అలాగే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు, జాబ్ మేళాకు సంబంధించిన స‌మాచారం సైతం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఈ యాప్ గేమ్ ఛేంజ‌ర్: హరీశ్ రావు

హరీశ్ రావు యువతనుద్దేశించి మాట్లాడారు. పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే ఎంతోమంది విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చానన్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. పదేళ్లుగా చదువుతున్నా ప్రభుత్వ కొలువు సాధించలేకపోతున్నారని, నిరుద్యోగులకు ఈ యాప్ ఓ గేమ్ ఛేంజర్ అన్నారు హ‌రీశ్ రావు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>