లండన్‌లో అగ్నిప్రమాదం.. నిజామాబాద్ యువకుడు మృతి

కలం, వెబ్ డెస్క్: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు, అగ్ని ప్రమాదాల (Fire Accidents) కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు చనిపోతున్నారు. గడిచిన ఆరు నెలల్లో వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. బంగారు భవిష్యత్తు కోసం తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే.. విగత జీవులుగా చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నిజామాబాద్ (Nizamabad) యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌లోని (Nizamabad) శ్రీనగర్ కాలనీకి చెందిన కామినేని సాయి శ్రీకర్ (Kamineni Sai Srikar) లండన్‌లో MS పూర్తి చేశాడు. అతడు లండన్‌లోని (London) అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, బ్రెయిన్ డెడ్‌తో మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన శ్రీకర్ చనిపోయాడు. శ్రీకర్ అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు తల్లిదండ్రులు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకి తెప్పించాలని వారు కోరుతున్నారు.

Read Also: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం: బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>