హరీశ్ రావు పరువు నష్టం కేసు.. నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు!

కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు (Defamation Case)లో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

తనపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను భంగపరిచేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ హరీశ్ రావు గతంలో నాంపల్లి స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించి విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, అక్టోబర్ 29న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌లను ఆదేశించింది.

Also Read : కేంద్ర సంచలన సర్వే.. తెలంగాణలో భారీగా చెరువులు గాయబ్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>