ప్రతిభ విద్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

కలం, ​చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ (Chandrugonda) లోని ప్రతిభ విద్యాలయం (Prathibha Vidyalayam) లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ వేడుకలు కులమతాలకు అతీతంగా అత్యంత వైభవంగా జరిగాయి. మత సామరస్యానికి, ఐక్యతకు అద్దం పడుతూ నిర్వహించిన ఈ పండుగలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆడిపాడారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ నాయకులు మలోత్ భోజ్య నాయక్ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఐకమత్యం, సోదరభావం పెంపొందించడానికి, తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కులమతాల గీతలు చెరిపేసి అందరినీ ఒకే వేదికపైకి తెచ్చిన పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

​ఈ సంబరాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి సురేష్, సర్పంచ్ రుక్మిణి, ఉపాధ్యాయులు పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం అంబరాన్నంటింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>