కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన సవాల్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. అప్పులపై జూపల్లి తనకు రాసిన లేఖ అందిందని.. అప్పులపై రేవంత్, జూపల్లి చెరో మాట చెబుతున్నారని ఆరోపించారు. అప్పులపై అసత్య ప్రచారాలు చేస్తున్న జూపల్లికి చీము, నెత్తురు .. పాలమూరు పౌరుషం ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే అప్పుల విషయంలో మంత్రులు గోల్ కొడతామని సెల్ఫ్‌గోల్ అయ్యారని ఎద్దేవా చేశారు. జూపల్లి (Minister Jupally) తీరు పూటకో సవాల్.. రోజుకో అడ్రస్ లా ఉందని విమర్శించారు. తెలంగాణ భవన్ కు వస్తానని తోక ముడిచిన జూపల్లి.. గన్ పార్క్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. తీర గన్ పార్క్ కు కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో తమను అడ్డగించారని మండిపడ్డారు. జూపల్లి లేఖలో కాంగ్రెస్ అప్పు రూ.1.77 లక్షల కోట్లు కాగా.. ఆర్బీఐ ప్రకారం కాంగ్రెస్ అప్పు రూ.1.86 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు. అయితే ఐదు నెలల క్రితం రాష్ట్ర అప్పు రూ. 3.47 లక్షల కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. మంత్రులు, సీఎంకు అప్పులపై అవగాహన లేనట్లు తెలుస్తోందని హరీశ్ రావు (Harish Rao) విమర్శలు గుప్పించారు.
Read Also: పక్కపక్క భూములే.. పరిహారంలో తేడా!
Follow Us On: Sharechat

