సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో స్పందించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తాము సభలో ఉంటే  తమ ప్రభుత్వ స్కాములను చెబుతామనే.. తమను సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు.

బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి తాము పారిపోలేదని.. ప్లాన్ ప్రకారమే తమ సభ్యులను బయటకు పంపించారని ఆరోపించారు. తమపై ఎదురుదాడి తప్పితే.. ఈ మూడేళ్ళలో రేవంత్ సర్కార్ చేసిందేంటి? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలపై తాము ప్రశ్నిస్తుంటే.. తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. 22ఏ భూములతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటలతోనే తేలిందన్నారు.

Also Read : గోల్డ్ డిఫెండ్‌కి భారత్ రెడీ.. కెప్టెన్ పుష్ప రాణా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>