కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్ రావు ఫైర్

కలం, మెదక్ బ్యూరో: గోదావరి నదిలో నీళ్లున్నా మోటార్లు నడపడం లేదని, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. సిద్దిపేట జిల్లా అక్కనేపల్లి (Akkanepalli) గ్రామంలో నిర్వహించిన ఈత వనాల పెంపకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. గోదావరిలో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని  మండిపడ్డారు.

రంగనాయక సాగర్‌‌(Ranganayaka Sagar)కు నీళ్లు రాకుండా ప్రభుత్వం కేవలం 8 గంటలు మాత్రమే మోటార్లను నడుపుతోందని హరీశ్ రావు మండిపడ్డారు. దీనివల్ల సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టును నీటితో నింపాలని తాను నిరంతరం పోరాడుతున్నానని చెప్పారు.

అక్కనేపల్లిలో నాటిన ఈత చెట్లను కనీసం రెండేళ్ల పాటు జాగ్రత్తగా కాపాడుకుంటే, అవి జీవితాంతం గీత కార్మికులకు ఉపాధినిస్తాయని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఈ చెట్ల సంరక్షణలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గీత కార్మికులకు కేసీఆర్ పాలనలోనే గుర్తింపు వచ్చిందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గీత కార్మికుల సంక్షేమానికి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని హరీశ్ రావు తెలిపారు. చెట్టు పన్ను రద్దు చేయడం, కొత్త సొసైటీల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం, పాత బకాయిలను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా ఆటోమేటిక్ రిన్యూవల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చి గౌడన్నలకు అండగా నిలిచామని గుర్తుచేశారు.

Also Read : క‌లెక్ట‌ర్ వద్దకు ఎర్రవల్లి భూముల సర్వే నివేదిక‌

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>