Mobile Popup Ad
Mobile Popup Ad

మోనాలిసాకు బిగ్ షాక్.. కేరళలో పోలీస్ కేసు..!

కలం, వెబ్ డెస్క్ : కుంభమేళా మోనాలిసా (Monalisa) సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలో మహారాష్ట్రకు చెందిన తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను నిన్న కేరళలోని అరుమనూర్ నయనార్ గుడిలో పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లిపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోనాలిసాది లవ్ జిహాదీ అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా వీహెచ్ పీ నాయకులు కొందరు మోనాలిసా మైనర్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాము మోనాలిసా (Monalisa) తల్లితో మాట్లాడామని.. ఆమె మైనర్ అమ్మాయి కాబట్టి ఈ వివాహం చెల్లదు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాలపై మోనాలిసా క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి లవ్ జిహాదీ కాదని పేర్కొంది. తాను హిందూ ఆచారం ప్రచారమే పెళ్లి చేసుకున్నానని.. అన్ని మతాలను గౌరవిస్తామని మోనాలిసా జంట తెలిపింది. అలాగే తాను మైనర్ ను కాదని స్పష్టం చేసింది. తన బర్త్ డేట్ 01-01-2008 అని.. కానీ తన తల్లితో కొందరు వీహెచ్ పీ నాయకులు మాట్లాడిన తర్వాత 21-01-2009 అని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చెప్పింది. కేరళ-2 స్టోరీలోని దివ్య పైల్వాల్ పాత్ర లాగా తన పెళ్లిని మార్చేస్తున్నారని.. అది నిజం కాదని మోనాలిసా వివరించింది.

Read Also: ఏఐ నటుల పాటపై దుమారం.. రంగంలోకి నటీనటుల సంఘం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>