హార్దిక్‌పై కేకేఆర్ కన్ను.. కారణాలు ఇవే కావొచ్చు!

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2027లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) జట్టు మారే అవకాశాలు ఉన్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా తాజాగా హార్దిక్‌ను సొంతం చేసుకోవడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఒప్పందం కుదిరితే ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. హార్దిక్ కోసం కేకేఆర్ పూర్తిగా నగదు రూపంలో ట్రేడ్ చేయాలని భావిస్తోంది. ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియన్స్ అతడిని రూ.16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.

ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో..

అయితే గత రెండు సీజన్లలో హార్దిక్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2025 సీజన్‌లో అతడు 12 ఇన్నింగ్స్‌లలో 224 పరుగులు చేయగా, 14 వికెట్లు తీశాడు. 2026లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ మరింత వెనుకబడ్డాడు. 10 ఇన్నింగ్స్‌లలో 206 పరుగులు మాత్రమే చేయగా, బౌలింగ్‌లో కేవలం నాలుగు వికెట్లు సాధించాడు. కెప్టెన్‌గా కూడా మూడు సీజన్లలో ఒక్కసారి మాత్రమే ముంబైని ప్లేఆఫ్స్‌కు చేర్చగలిగాడు.

హార్దిక్ ఉంటే మిడిల్ ఆర్డర్ బలంగా..

అయితే ఈ ట్రేడ్‌లో కేకేఆర్‌కు కొన్ని కీలక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. జట్టులో నాణ్యమైన భారతీయ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కొరతను హార్దిక్ భర్తీ చేయగలడు. అలాగే మిడిల్ ఆర్డర్‌కు స్థిరత్వం తీసుకురావడంతో పాటు బ్యాటింగ్ లోతును పెంచే అవకాశం ఉంది. గత సీజన్‌లో ఓపెనింగ్ జోడీ విషయంలో కేకేఆర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. హార్దిక్ జట్టులోకి వస్తే కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉండటంతో, బ్యాటింగ్ కాంబినేషన్‌ను మరింత సమర్థంగా రూపొందించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రేడ్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ హార్దిక్ పేరు చుట్టూ ఐపీఎల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>