కలం, వెబ్‌డెస్క్: మల్కాజ్గిరి పోలీస్ (Malkajgiri Police) కమిషనరేట్ పరిధిలో వివిధ కారణాలతో జప్తు చేసిన 510 వాహనాలను అధికారులు అంబర్‌పేట్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌కు తరలించారు. వీటిని చట్టప్రకారం వేలం వేసేందుకు ప్రక్రియను ప్రారంభించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఇందులో కార్లు, బైకులు ఉన్నాయి. ఈ వాహనాల జాబితాను తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, వాహనదారులు లేదా ఫైనాన్స్ హక్కులు ఉన్న వ్యక్తులు/సంస్థలు వెంటనే వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.
సదరు వాహన యజమానులు నోటీసు ప్రచురించిన తేదీ నుంచి 6 నెలల వ్యవధిలో ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించి తమ వాహనాలను తీసుకెళ్లాలని మల్కాజ్గిరి పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల వివరాల కోసం https://malkajgiripolice.telangana.gov.in వెబ్‌సైట్‌లోని సిటిజన్ సర్వీసెస్ అబాండెడ్ వెహికిల్స్ విభాగాన్ని సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8712662661, 8008338535 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

