వడ్డెపల్లి ప్రైమ‌రీ స్కూల్ హెచ్ఎం సస్పెండ్‌

కలం, హనుమకొండ: వడ్డెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Waddepally Primary School) ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడు నరేందర్‌ నాయక్‌ను జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్‌ గౌడ్‌ శుక్రవారం సస్పెండ్‌ చేశారు. పాఠశాల బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం, ఇతర దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వ‌చ్చాయి. దీంతో ఈ చర్యలు తీసుకున్నారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది జోక్యం చేసుకున్నారు.

తెలంగాణ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌తో పాటు ఇతర విద్యార్థి సంఘాలు కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పించాయి. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ (సీసీఏ) నిబంధనలు–1991 ప్రకారం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ అమల్లో ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>