ఖమ్మం యువతకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఉపాధి మేళా!

కలం, ​ఏన్కూరు: ఖమ్మం యువతకు ఇది గుడ్‌న్యూస్ లాంటింది. ఐటీసీ–ఎంఎస్‌కే, ప్రథమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీడీవో సహకారంతో ఈనెల 13న ఖమ్మం జిల్లా ఏన్కూరు (Enkuru) ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగ మేళా జరగనుంది. ఈ మేరకు జిల్లా కోఆర్డినేటర్ ఎన్. వెంకట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, సోలార్, బ్యూటీ పార్లర్, కంప్యూటర్, హోటల్ మేనేజ్‌మెంట్, మెకానికల్, నర్సింగ్ కోర్సుల్లో 45 రోజులపాటు ఉచిత శిక్షణతోపాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

​18 నుండి 35 ఏళ్ల వయస్సు ఉండి 8వ తరగతి నుండి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ వరకు చదివిన అభ్యర్థులందరూ అర్హులని పేర్కొన్నారు. కేవలం 50 సీట్లు మాత్రమే ఉన్నందున ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు ఈనెల 13న తమ సర్టిఫికేట్ల జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>