కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanamkonda) జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ లో సల్మాన్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన గురువారం కలకలం రేపింది. ప్రేమించిన అమ్మాయి తనను దూరం పెడుతోందని మనస్థాపానికి గురైన సల్మాన్ ఫ్లోర్ క్లీనర్ తాగి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Read Also: బీఆర్ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నది -సీఎం
Follow Us On: Instagram

