98 పరుగులకే ఔట్.. అయినా గిల్ ఖాతాలో రికార్డు!

క‌లం, స్పోర్ట్స్: సెంచరీ మిస్ అయినా.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అరుదైన రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 98 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో టెస్టుల్లో నాలుగోసారి 90ల స్కోరు వద్ద వికెట్ కోల్పోయాడు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వంటి భారత దిగ్గజాల సరసన చేరాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ చెరో 10 సార్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రిషభ్ పంత్ ఏడుసార్లు, ధోనీ, గవాస్కర్, సెహ్వాగ్ ఐదుసార్లు 90ల్లో ఔటయ్యారు. మరోవైపు గిల్ తన ఇన్నింగ్స్‌తో భారత్‌కు మంచి ఆధిక్యం అందించాడు.

కేఎల్ రాహుల్ 136, దేవదత్ పడిక్కల్ 80 పరుగులతో రాణించగా.. గిల్ 146 బంతుల్లో 98 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. రిషభ్ పంత్ 62 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేశాడు. గిల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లకు 486 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 368 పరుగులు కాగా.. భారత్ 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>