కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్‌లో కవల శిశువులను కోల్పోయిన బోరేకర్ సునీత కుటుంబానికి ఉద్యోగం కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు (Adilabad Collector) టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి దుర్గం శేఖర్, నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి అభినందించారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి ఉపాధి, సొంతింటి భరోసా కల్పించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పరమేశ్వర్, మేకల జితేందర్, ప్రజ్ఞశీల్, జితేందర్ సోంకాంబ్లె తదితరులు పాల్గొన్నారు.

