Mobile Popup Ad
Mobile Popup Ad

ఫుట్ పాత్ ఆక్రమణల పై చర్యలు: కలెక్టర్

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanamkonda) జిల్లా కలెక్టర్ బల్దియా ఇంచార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయి గురువారం రాత్రి బల్దియా పరిధిలోని 51వ డివిజన్, జిల్లా కోర్టు అదాలత్ పక్కన నుంచి సర్క్యూట్ గెస్ట్ హౌస్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఆక్రమణలను పరిశీలించారు. ఈ సందర్భంగా కడాయి రెస్టారెంట్ చౌరస్తా వద్ద రోడ్డు మరియు ఫుట్‌పాత్‌లపై అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లు, మురుగు కాల్వలపై చేసిన ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించే చర్యలను అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే చేపట్టిన ఆక్రమణల తొలగింపు పనులను పరిశీలించి, రహదారులు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. అలాగే ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా ఎవరూ రోడ్లపై ఆక్రమణలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ శంకర్ లింగం, కాజీపేట్ ట్రాఫిక్ సీఐ వెంకన్న, స్టేషన్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>