Mobile Popup Ad
Mobile Popup Ad

తెల్లజుట్టు వేధిస్తోందా?.. ఆ 3 పదార్థాలతో నేచురల్ హెయిర్ కలర్ రెడీ!

కలం, వెబ్‌డెస్క్: ఒకప్పుడు తెల్లజుట్టు రావడం అనేది వృద్దాప్యంలో జరిగేది. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వేధిస్తుంది. అయితే ప్రస్తుతం మారుతున్న జీవిన శైలి దీనికి ప్రధాన కారణం అని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, కెమికల్ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతోంది. ఇక దీన్ని కవర్ చేయడానికి చాలామంది హెయిర్ డైలు, కెమికల్ కలర్స్ వాడుతుంటారు. దీనివల్ల జుట్టుకు నష్టం కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజంగా జుట్టు సంరక్షించుకుంటూ (Hair Care) రంగును మెరుగుపరచాలనుకునేవారికి ఒక సింపుల్ హోమ్ రెమెడీ మంచి పరిష్కారంగా మారుతోంది. అదేమిటో తెలుసుకుందాం.

ఈ సింపుల్ హోమ్ రెమిడీని తయారుచేసుకునేందుకు మనకు కావాల్సిన పదార్థాలు.. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ కాఫీ పొడి, అర చెక్క నిమ్మకాయ రసం

తయారుచేసుకునే విధానం

ముందుగా ఒక చిన్న బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి. తర్వాత నిమ్మకాయ రసం వేసి ఈ మూడు పదార్థాలను కలుపుతూ మిశ్రమంలా తయారుచేసుకోవాలి. జుట్టు పూర్తిగా డ్రైగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని రూట్స్ నుంచి జుట్టు కొనల వరకు అప్లై చేస్తూ, మెల్లగా మసాజ్ చేస్తూ తలకు పట్టించాలి. అలా పట్టించిన మిశ్రమాన్ని అరగంట నుంచి గంట వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ ప్యాక్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా జుట్టు నెరవడాన్ని తగ్గించడంలో, సహజమైన రంగును మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుందట. ఈ రెమెడీలో ఉపయోగించిన కొబ్బరి నూనె జుట్టు లోపలి పొరల వరకు (Hair shafts) చొచ్చుకుపోయి, ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు కావలసిన మాయిశ్చరైజర్ అందించి, కుదుళ్లను బలోపేతం చేస్తుంది. కాఫీలోని ‘కెఫిన్’ (Caffeine) జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరగడానికి (Hair growth) దోహదపడుతుంది. అలాగే, ఇందులోని సహజ పిగ్మెంట్స్ జుట్టుకు తాత్కాలికంగా ముదురు రంగును (Dark tone) ఇస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాసిడ్ గుణాలు తల చర్మంపై (Scalp) ఉండే అదనపు నూనెను, చుండ్రును శుభ్రపరుస్తాయి.

ఈ రెమెడీని వారానికి ఒకసారి ఉపయోగించడం వల్ల కొన్ని వారాల్లో జుట్టులో మార్పు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది పూర్తిగా సహజ రెమెడీ కాబట్టి.. ఫలితాలు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండకపోవచ్చు. మీకు ఏదైనా అలర్జీ సమస్యలు ఉంటే ముందుగా పాచ్ టెస్ట్ చేయడం మంచిదట. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>