Mobile Popup Ad
Mobile Popup Ad

పంచాయతీ భవనానికి ‘బఫర్’ బ్రేక్ : మంత్రి ఇలాకాలోనే ఇలా!

కలం, నల్లగొండ బ్యూరో : అధికారం మారితే రూల్స్ మారుతాయా? ప్రభుత్వాలు మారితే ప్రజల అవసరాలు మారిపోతాయా? సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం (Gudimalkapuram) గ్రామస్తుల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం కొత్త పంచాయతీ భవనాన్ని ప్రారంభించకుండా తాళం వేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న పాత భవనంలోనే పంచాయతీ కార్యకలాపాలు కొనసాగుతుండగా, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని నిర్మించిన కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకురాకపోవడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు.

2019లో కొత్త పంచాయతీ భవన నిర్మాణం ప్రారంభించగా.. 2024లో సర్పంచ్ పొల్లేడి నరసమ్మ హయాంలో పూర్తయింది. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా భవనాన్ని ప్రారంభించాలని గ్రామ పాలకవర్గం, ప్రజలు భావించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యదర్శి అనితా కుమారి భవనానికి తాళం వేయడంతో గ్రామస్తులు నిరాశ చెందారు. ప్రస్తుత పాత పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుందని, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా సర్పంచ్, మహిళా కార్యదర్శి విధులు నిర్వహించేందుకు కూడా అనుకూల పరిస్థితులు లేవని, గ్రామసభ నిర్వహించడం సైతం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బఫర్ జోన్ నెపంతో నో పర్మిషన్..

కొత్త పంచాయతీ భవనం నీటిపారుదల శాఖ పరిధిలోని బఫర్ జోన్‌లో ఉందన్నది అధికారుల వాదన. అయితే ఇరిగేషన్‌కు సంబంధించిన అన్ని పత్రాలు అనుకూలంగా ఉన్నాయని గ్రామస్తులు వాదిస్తున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోనే ఈ వివాదం నడవడం గమనార్హం. భవనం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైన దశలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వివాదాలు సృష్టించడం సరికాదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని వినియోగంలోకి తీసుకురాకపోతే ప్రజలే నష్టపోతారని పేర్కొంటున్నారు. ఈ వివాదంపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి, కొత్త పంచాయతీ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని కోరుతున్నారు. అయితే.. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Read Also: CM రేవంత్ ధీమా.. ఎమ్మెల్యేల్లో డైలమా.. కారణమదేనా??

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>