Mobile Popup Ad
Mobile Popup Ad

చితకొట్టిన గుజరాత్ ఓపెనర్లు.. సీఎస్‌కే టార్గెట్ 230

కలం, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జీటీ (GT vs CSK) ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఊచకోత కోశారు. 64 పరుగుల దగ్గర గిల్ ఔట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన బట్లర్.. అదే ఊపును కొనసాగిస్తూ స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. కానీ సాయి సుదర్శన్ వికెట్ పడటం వెంటనే తెవాటియా కూడా గోల్డెన్ డకౌట్ కావడంతో గుజరాత్ స్పీడ్‌కు కాస్త బ్రేకులు పడ్డాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. వీరిద్దరూ చెన్నై బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ మొదటి వికెట్‌కు ఏకంగా 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి జాన్సన్ బౌలింగ్‌లో దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ క్రీజులోకి రాగానే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు సెంచరీ దిశగా సాగుతున్న సాయి సుదర్శన్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి కాంబోజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సుదర్శన్ అవుటైన వెంటనే రాహుల్ తెవాటియా (0) గైక్వాడ్ రనౌట్ చేయడంతో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే వాషింగ్టన్ సుందర్ కేవలం 7 పరుగులు చేసి ముకేశ్ చౌదరి బౌలింగ్‌లో పటేల్‌కు దొరికిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జోస్ బట్లర్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ పడగొట్టారు. అయితే కాంబోజ్ 4 ఓవర్లలో 56 పరుగులు, జాన్సన్ 47 పరుగులు ఇచ్చి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. గుర్జాప్‌నీత్ సింగ్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి కాస్త కట్టడి చేసినా వికెట్ తీయలేకపోయాడు. నూర్ అహ్మద్ 3 ఓవర్లలో 41 పరుగులు ఇవ్వగా, శివమ్ దూబే వేసిన ఒకే ఒక్క ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. ఎక్స్‌ట్రాల రూపంలో చెన్నై జట్టు 17 పరుగులు సమర్పించుకుంది. ఇప్పుడు చెన్నై గెలవాలంటే 20 ఓవర్లలో 230 పరుగులు చేయాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>