గంగుల చేతుల మీదుగా సదర్ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు (Karimnagar Sadar Utsav) ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ ఆదివారం రోజున నగరంలోని సర్కస్ మైదానంలో సదర్ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించేందుకు యాదవ సంఘం ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను యాదవ సంఘం ప్రతినిధులు నేడు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సదర్ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను గంగుల కమలాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవాల నిర్వహణ వివరాలను ఎమ్మెల్యేకు వివరించి, కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను ప్రతిఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు.

సదర్ ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

వచ్చే ఆదివారం సర్కస్ మైదానంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనానికి యాదవ సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సదర్ ఉత్సవాల విశిష్టతను చాటిచెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ కార్పొరేటర్ ఐలందర్ యాదవ్, సదర్ ఉత్సవాల కమిటీ చైర్మన్ రవి యాదవ్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రసాద్ యాదవ్, సుధా యాదవ్, హరీష్ పటేల్, అభిలాష్ పటేల్, సాయి కృష్ణ బిట్టు, తదితర యాదవ సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>