శిశు మందిర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం

క‌లం, క‌రీంన‌గ‌ర్: కరీంనగర్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ (Sri Saraswathi Shishu Mandir) హైస్కూల్ వినాయక నిమజ్జన (Ganesh Immersion) వేడుక‌లు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని భక్తిగీతాలు, నినాదాలు, డప్పుల వాయిద్యాలతో వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. “గణపతి బప్పా మోరియా – మంగళమూర్తి మోరియా” నినాదాలతో కార్యక్రమం సందడిగా సాగింది. విద్యార్థుల్లో భక్తితో పాటు ఐక్యత, క్రమశిక్షణ, సేవాభావం, పర్యావరణ పరిరక్షణ, దేశభక్తి వంటి విలువలను పెంపొందించే విధంగా ఉత్సవాలను నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రకృతికి హాని కలగకుండా నిమజ్జనం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ మాట్లాడుతూ, వినాయకుడు జ్ఞానం, వివేకం, ఏకాగ్రత, విఘ్నాలను అధిగమించే శక్తికి ప్రతీక అని, విద్యార్థులు వినాయకుని గుణాలను తమ జీవితంలో ఆచరించాలని సూచించారు. పండుగలు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా సంస్కారం, సమాజ ఐక్యత, దేశభక్తిని పెంపొందించే వేదికలుగా ఉండాలని తెలిపారు. చివరగా భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం నిర్వహించి, వచ్చే ఏడాది మరింత ఆనందంగా తిరిగి రావాలని పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి ఆకాంక్షించారు. వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఎలగందుల సత్యనారాయణ, గట్టు శ్రీనివాస్, అడ్వకేట్ బొడ్ల శ్రీనివాస్, విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>