కలం, నల్లగొండ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలు.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, మండల విద్యాధికారి మేకల నాగయ్య, స్థానిక కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

