దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చిన్నారి హత్య

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో శ్రీరామ్‌ నగర్ కాలనీలో రాత్రి దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి (Extramarital Affair Dispute) అడ్డు వస్తున్నాడని ఐదేళ్ల చిన్నారిని దుర్మార్గుడు హత్య చేశాడు. లక్ష్మి, నర్సింహులు ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్న సహజీవనం చేస్తున్నారు. లక్ష్మితో గొడవ పడి కొన్నేళ్ల క్రితం ఆమె భర్త వదిలి వెళ్లిపోయాడు. ఈమెకు ఒక శ్రవణ్ అనే ఐదేళ్ల చిన్న కుమారుడు ఉన్నాడు. భర్తకు దూరంగా ఉన్న ఈమెకు నర్సింహులు పరిచయమయ్యారు.

ఈ క్రమంలోనే వీరి మధ్య బంధం బలపడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే నిత్యం లక్ష్మీతో సన్నిహితంగా ఉంటుండగా.. అడ్డుగా వస్తున్నాడని లక్ష్మి కుమారుడు శ్రావణ్‌ను నర్సింహులు దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో లక్ష్మి లేని సమయంలో నర్సింహులు ఆమె ఇంటికి వచ్చి శ్రావణ్‌ కళ్లలో కారం కొట్టి గొంతు నులిమి, కర్రతో శ్రావణ్‌ తలపై బాది నేలకేసి కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి (Kamareddy) పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని లక్ష్మి, నర్సింహులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Read Also: హిట్ అండ్ రన్ కేసు: లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>