కలం, స్పోర్ట్స్: సీనియర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరందున్నాయి. ఆమె ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడి కొడుకును పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం సారా సొంతం. ఆమె సినిమాల్లో నటించకపోయినా మోడలింగ్ చేయడంతో పాటు, పలు బ్రాండ్లకు యాడ్స్ కూడా చేశారు. అలాగే పలు ఈవెంట్లలో , ఫ్యామిలీ ఫంక్షన్లలో అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు. లండన్‌లో హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన సారా ప్రస్తుతం సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌గా పని చేస్తున్నారు.
సారా (Sara Tendulkar) ముంబైలోని అంధేరిలో తన సొంత పైలేట్స్ అకాడమీని కూడా స్థాపించారు. ఇక సారాకు బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కొడుకు రాజ్వీర్ డియోల్(Rajveer Deol)తో పెళ్లి జరుగనున్నట్లు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2027లో వీరు పెళ్లి పీటలెక్కనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు అటు సచిన్ ఫ్యామిలీ నుంచి గానీ, ఇటు సన్నీ ఫ్యామిలీ నుంచి గానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. కానీ, ఈ న్యూస్ సోషల్ మీడియాతో పాటు బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.
Also Read : ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ భారీ విరాళం
Follow Us On : WhatsApp

