Mobile Popup Ad
Mobile Popup Ad

పైపైకి వెళ్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన‌ బంగారం, వెండి ధ‌ర‌లు(Gold Silver Prices) మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే కేజీ వెండి ధ‌ర‌(Silver Price) ఏకంగా రూ.15,000 పెరిగింది. ఇక హైదరాబాద్ లో బంగారం ఒక్క తులంపై రూ.2,000కు పైగా పెరిగింది. ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Price) రూ.1,56,600 ఉండ‌గా సోమ‌వారం రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆదివారం రూ.1,43,550 ఉండ‌గా సోమ‌వారం రూ.2,050 పెరిగి రూ.1,45,600కి చేరుకుంది. మ‌రోవైపు వెండి ఇంకా త‌గ్గుతుంద‌ని అంద‌రూ భావిస్తున్న త‌రుణంలో ఒకేసారి భారీగా పెరిగింది. ఆదివారం కిలో వెండి ధ‌ర రూ.2,85,000 ఉండ‌గా సోమ‌వారానికి రూ.15,000 పెరిగి రూ.3,00,000కు చేరుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>