శాంతి నగర్ వాసవీ ఆలయంలో గోమాతకు ప్రత్యేక పూజలు

కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం గోమాతకు, గోప్రచారక్ సేవ సమితి ఆధ్వర్యంలో సభ్యులు ప్రత్యేక పూజలు (Gomatha Pooja) నిర్వహించారు.

ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేసి గ్రాసం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రామచంద్రుడు, ఉపాధ్యక్షుడు గొంగళ్ళ రాముడు, వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం వెంకటేశ్వర్లు, కురవ వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, బాదం వెంకటేశ్వర్లు దంపతులు, హరి ప్రసాద్ పాల్గొన్నారు.

అనంతరం ఆలయ సమూహంలోని శ్రీ వాసవి మాతను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ నగరేశ్వర స్వామి వారిని దర్శించుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>