కలం, నిజామాబాద్ బ్యూరో: వరల్డ్ గ్లకోమా (Glaucoma) వీక్ సందర్భంగా డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ (Doctor Naveen Super Speciality Eye Hospital) ఆధ్వర్యంలో నిజామాబాద్ (Nizamabad) నగరంలో గ్లకోమా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కంటి వ్యాధుల వైద్య నిపుణుడు, కేటరాక్ట్ రెటీనా సర్జన్ డా. నవీన్ నూకల(Naveen Nukala) పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. నవీన్ మాట్లాడుతూ.. 40 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్లకోమా అనేది నిశ్శబ్దంగా చూపును నాశనం చేసే వ్యాధి అని, ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు.
గ్లకోమా (Glaucoma) వ్యాధిని గుర్తించేందుకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు తమ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కంటి సంబంధిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను తక్కువ ఖర్చుతో, మంచి నాణ్యతతో నిజామాబాద్‌లోనే అందిస్తున్నామని, చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు నిజామాబాద్ (Nizamabad) ఆప్టోమెట్రిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్, ఆప్టోమెట్రిస్ట్‌లు, ఇతరులు పాల్గొన్నారు.
Read Also: కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏపై అట్రాసిటీ కేసు!
Follow Us On : WhatsApp

