కలం, వెబ్ డెస్క్ : అమెరికా వద్ద ఉన్న అపారమైన ఇంధన వనరులు చైనాపై తమ దేశానికి వ్యూహాత్మక ఆధిక్యాన్ని కల్పిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. అమెరికాలో చమురు, గ్యాసోలిన్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొంటూ దేశ ఇంధన సామర్థ్యాన్ని ఆయన ప్రస్తావించారు.
తమ వద్ద 1000 సంవత్సరాలకు సరిపడా గ్యాసోలిన్ నిల్వలు ఉన్నాయి.. చైనా వద్ద అలాంటి నిల్వలు లేవు అని ట్రంప్ తెలిపారు. దీంతో అమెరికా ఇంధన పరంగా ఎంతో బలమైన స్థితిలో ఉందని ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమాసియా ఇంధన వనరులను పరిగణనలోకి తీసుకుంటే అమెరికా స్థానం మరింత బలపడుతుందన్నారు. తమ వద్ద ఇప్పటికే భారీగా ఉన్న చమురు నిల్వలకు వెనిజులాను కూడా కలిపితే, నిజంగానే అపారమైన చమురు నిల్వలు ఉన్నట్లే అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

