సీనియర్ సిటిజన్లకు డిప్యూటీ మేయర్ భరోసా

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: సీనియర్ సిటిజన్ ఫోరం (Senior Citizen Forum) సభ్యుల అనుభవాలు సమాజానికి ఎంతో విలువైన మార్గదర్శకమని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ (Mahabubnagar Deputy Mayor) మారేపల్లి సురేందర్ రెడ్డి (Marepally Surender Reddy) అన్నారు. బుధవారం స్థానిక పారిశ్రామిక వాడలోని సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో నిర్వహించిన ఫోరం విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. పట్టణంలో సీనియర్ సిటిజన్ ఫోరం నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. వారి జీవిత అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, నేర్చుకున్న పాఠాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లు అందించే సూచనలు, సలహాలు సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయని, యువతకు సరైన దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. ఫోరం కార్యాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

అంతకుముందు ఫోరం అధ్యక్షుడు జగపతిరావు సంస్థ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫోరం కోశాధికారి కె.వి. అశోక్ తన జన్మదిన సందర్భంగా ఫోరంకు వాటర్ కూలర్‌ను వితరణ చేశారు. డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పూజ నిర్వహించి వాటర్ కూలర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ వాణిశ్రీ ప్రశాంత్, ఫోరం ఉపాధ్యక్షుడు రాజసింహుడు, కార్యదర్శి నస్కంటి నాగభూషణం, కోశాధికారి కె.వి. అశోక్, ఈసీ సభ్యులు జి. నాగభూషణం, రాములు, కోటేశ్వర రెడ్డి, అహ్మద్, లోకయ్య, సిద్దరామప్ప తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>