శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు: పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) కమీషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు (Law and Order) విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం (Gaush Alam) హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత ఏసీపీల నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని తెలిపారు. అనుమతులు లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని సంబంధిత అధికారుల నుండి అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. అనుమతుల కోసం దరఖాస్తు చేయడం ద్వారా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అట్టి కార్యక్రమానికి తగిన విధంగా పోలీసు శాఖ భద్రతాపరమైన చర్యలు చేపడుతుంది అన్నారు.

ఈ చట్టం అమలులో ఉండగా ఇతరులను గాయపరిచే విధంగా ఉండే వస్తువులు, మారణాయుధాలను ధరించి సంచరించకూడదని చెప్పారు. రోడ్లు, ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాల్లో జనాన్ని సమీకరించకూడదని స్పష్టం చేశారు. జన సంచారం, అనుమతి పత్రాలలో పేర్కొన్నబడిన ప్రాంతాలలో మ్యూజిక్ లు, పాటలు, ప్రసంగాలు, రణగొణ ధ్వనులు చేయవద్దని కోరారు. ఈ ఉత్తర్వులు ఈనెల 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>