Mobile Popup Ad
Mobile Popup Ad

గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.. రోడ్డు పొడవునా సిలిండర్లే..!

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ గ్యాస్ సిలిండర్ల (Gas cylinders) లారీ బోల్తా పడింది. రాజస్థాన్ లోని కిషన్ గఢ్ టోల్ ప్లాజాకు దగ్గర్లో హైవే మీద లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో సిలిండర్లన్నీ రోడ్డు మీద పడిపోయాయి.

రోడ్డు పొడవునా సిలిండర్లు దొర్లుకుంటూ వెళ్లాయి. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 145 గ్యాస్‌ సిలిండర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సిలిండర్లను వాహనంలోకి ఎక్కించి తరలించారు.

Read Also: ఎల్పీజీ కష్టాలకు చెక్.. ఆల్టర్నేట్‌గా డీఎంఈ..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>