నర్సింహులపేట మండలంలో గ్యాస్ వినియోగదారుల ధర్నా

కలం, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలో గ్యాస్ వినియోగదారుల ధర్నా చేపట్టారు. ఇటీవల గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటి గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా ఎక్కువ అవుతుంది. గృహ అవసరాలకు వాడే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా మళ్లిస్తున్నారు. సాధారణ ప్రజలు గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతుంటే, బ్లాక్ మార్కెట్‌లో మాత్రం అడిగినంత ధర చెల్లిస్తే ఎన్ని సిలిండర్లు అయినా ఇస్తున్నారు. ఈ తరహాలోనే నరసింహులపేట మండలం భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్‌ను సూర్యాపేట జిల్లాకు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్యాస్ వినియోగదారులు ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి 365 పై ధర్నాకు దిగారు.

Read Also: మ్యాజిక్ డ్రెయిన్స్‌పై పీవీ సింధు స్పెషల్ వీడియో

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>