వరంగల్‌లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు

కలం, వెబ్ డెస్క్ : వరంగల్‌ (Warangal) లో భారీ రాజకీయ కార్యక్రమానికి బీఆర్ఎస్ (BRS) సిద్ధమైంది. ఈ నెల 6న హంటర్ రోడ్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు (Rythu Sangrama Sadassu) నిర్వహించనున్నారు. సుమారు 10 వేల మంది రైతులతో ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలులో వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ ఆయన ప్రసంగం చేయనున్నట్లు సమాచారం. ఈ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. రైతుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఈ సదస్సు కీలకంగా మారనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read Also:  నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి: రామ్మోహన్ నాయుడు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>