కలం, వెబ్ డెస్క్ : గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు (Gangster Atiq Ahmed Son Aban Ahmed) అబన్ అహ్మద్ మరణించాడు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అబన్ ప్రాణాలు కోల్పోయాడు. జైలులో ఉన్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా హైవేపై డివైడర్ ఢీకొనడంతో అబన్ తో పాటు సోనే అనే వ్యక్తి కూడా మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అతీక్ అహ్మద్ కు అతీక్ అహ్మద్ ఐదుగురు కుమారులలో అబన్ అహ్మద్ చిన్నవాడు. పెద్ద కొడుకు ఉమర్ అహ్మద్ లక్నో జైలులో ఉన్నాడు.
అలీ అహ్మద్ ఝాన్సీ జైలులో ఉండగా, మూడవ కుమారుడు అసద్ అహ్మద్ 2023లో ఝాన్సీలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. నాలుగో వాడైన అహ్జమ్ బయట ఉన్నాడు. ఐదవ కుమారుడైన అబన్ గురువారం జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి కారణం కావొచ్చని భావిస్తున్నారు.

