కలం, ముథోల్ : ముథోల్(Mudhole) పట్టణంలో ఆదివారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్రకు(Ganesh Immersion) పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
ముథోల్ రామాలయంలో ప్రతిష్ఠించిన సార్వజనిక వినాయకుడికి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర సాగిన మార్గాన్ని పరిశీలించి, భద్రతా చర్యలను సమీక్షించారు. శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భక్తులు, నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్‌లు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

