గాంధీజీ సత్యం, అహింస మార్గాలు స్ఫూర్తిదాయకం: గణేష్​ బిగాల

కలం, నిజామాబాద్ బ్యూరో: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ (Nizamabad) అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Ganesh Bigala) గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సహనం, సేవా మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.

దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఆయన నాయకత్వం భారత చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>