కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మూసీ నది (Musi River) పక్కన మహాత్ముని విగ్రహం ఏర్పాటుపై కొనసాగుతున్న వివాదం మీద గాంధీ మనవడు తుషార్ గాంధీ (Tushar Gandhi) మరోసారి స్పందించారు. విగ్రహం ఏర్పాటుపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘హైదరాబాద్‌లో గాంధీజీ విగ్రహం ఏర్పాటు కోసం ప్రజలను తరలిస్తున్నారనే అపోహలను నివృత్తి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టమైన ప్రకటన చేయాలి. నగర పౌరులు తమ ఇళ్లను కోల్పోతున్నది గాంధీ విగ్రహ నిర్మాణం కారణంగానే అనే భావన వ్యాపించడం గాంధీజీ కీర్తికి అపప్రథ తెచ్చేలా ఉంది. అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆ ట్వీట్లో తుషార్ గాంధీ పేర్కొన్నారు.
కాగా, అంతకుముందు సైతం ఇదే విషయంపై తుషార్ గాంధీ(Tushar Gandhi )‘ఎక్స్’ స్పందించిన విషయం తెలిసిందే. ప్రజల ఇళ్లను కూల్చి గాంధీజీ విగ్రహం కట్టడం, మహాత్ముని ఆదర్శాలకు వ్యతిరేకమని అప్పట్లో ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు మరోసారి తుషార్ గాంధీ ఈ విషయంపై స్పందిస్తూ సీఎంను ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: వాణిజ్య గ్యాస్ సరఫరాపై నిఘా.. ముగ్గురు అధికారులతో కమిటీ
Follow Us On : WhatsApp

