Mobile Popup Ad
Mobile Popup Ad

బంగారం చోరీ.. 4 రోజుల్లోనే ఛేదించిన పోలీసులు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం భీంనగర్ లో తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీ కేసును గద్వాల టౌన్ పోలీసులు (Gadwal Police) వేగంగా ఛేదించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 9 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ‌ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం జిల్లా‌ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.

ఈ నెల 10వ తేదీన గద్వాల పట్టణం భీంనగర్ లో‌ నివసిస్తున్న రహ్మత్ పాష ఇంటికి తాళం వేసి ఆఫీస్ కి వెళ్లాడు.‌‌ ఇంటికి తాళం వేసియున్నారని గమనించిన గుర్తు తెలియని నిందితులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న 9తులాల బంగారం‌, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.7వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడి గుర్తించి గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ గద్వాల సీఐ టి.శ్రీను పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు.‌ సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు గద్వాల మండలం చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన మహబూబ్ తో పాటు మరో మైనర్ బాలుడ్ని గుర్తించారు.

వీరిద్దరు గద్వాలకు వచ్చి‌ కూలి పని చేసే వారని,‌ డబ్బులు సరిపోనందున దొంగతనాలు పాల్పడేందుకు నిర్ణయించుకున్నారని‌‌ ఇదే క్రమంలో ఈనెల 10న భీంనగర్ లో ఇంటి‌ తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులిద్దరు‌ సోమవారం గద్వాల టౌన్ పరిధిలో చెనుగోనిపల్లి‌ రోడ్డులో అరెస్టు చేసినట్లు నిందితుల నుంచి చోరీకి గురైన 9తులాల‌ బంగారు, 60తులాల వెండీ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులలో ఒకరు మైనర్ (బాలనేరస్థుడు) అని ఎస్పీ తెలిపారు. కేసు నమోదైన నాలుగు రోజులో వ్యవధిలోనే నిందితులను పట్టుకుని, రికవరీ సాధించిన గద్వాల సీఐ టి.శ్రీను, టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ , సిబ్బంది చంద్రయ్య, కిరణ్, రామకృష్ణలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ వై.మొగులయ్య,‌‌‌సీఐ టి. శ్రీను,‌ గద్వాల్ ఎస్ఐ కళ్యాణ్‌కుమార్, తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>