గద్వాలలో ‘ప్రజా బాట’.. ప్రజల సమస్యలపై విద్యుత్ శాఖ కీలక చర్యలు

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) పట్టణంలో విద్యుత్ శాఖ అధికారులు గురువారం ‘ప్రజా బాట’ (Praja Bata) కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించారు. విద్యుత్ కనెక్షన్ల సమస్య ఉన్నచోట వాటిని పరిశీలించి పరిష్కరించారు.

ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్ఈ అబ్దుల్‌ కరీమ్ మాట్లాడుతూ.. ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ రవిప్రసాద్, ఏడీ రమేష్ బాబు, ఏఈ శివకుమార్, లైన్ మెన్లు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>