జగన్​ రాజకీయాలకు పనికి రాడు: మంత్రి పార్థ సారథి

క‌లం, వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్​ జగన్​ (YS Jagan) అసలు రాజకీయాలకు పనికొస్తాడా? అని మంత్రి కొలుసు పార్థ సారథి (Kolusu Parthasarathy) ప్రశ్నించారు. ఇటీవల జగన్​ పెట్టిన ప్రెస్​మీట్. ఆయన చేసిన విమర్శలకు పార్థసారథి కౌంటర్​ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగన్​ మూడు గంటల ప్రెస్​ట్‌లో తన కడుపు మంట, కూట‌మి ప్ర‌భుత్వంపై ఏడుపును మాత్ర‌మే చూపించార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే ఒక్క విష‌యం కూడా మాట్లాడ‌లేద‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ ఏనాడైనా ప్ర‌భుత్వానికి ప‌నికొచ్చే సూచ‌న‌లు ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు.

గొడ్డ‌లి పార్టీ అధ్య‌క్షుడికి గంట‌ల కొద్దీ ప‌నికి రాని ప్రెస్ మీట్లు పెట్ట‌డ‌మే ప‌నిగా మారింద‌ని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు సీఎంగా ప‌ని చేసిన జ‌గ‌న్‌ వ్యాఖ్య‌లు చూస్తుంటే ఆయ‌న‌ రాజ‌కీయాల‌కు ప‌నికి రాడ‌ని అనిపిస్తోంద‌న్నారు. త‌న‌ ప్ర‌భుత్వంలో ఎలాంటి ప‌నులు చేయ‌క‌పోడంతో చెప్పుకోవ‌డానికి ఏమీ లేక ప్ర‌జ‌ల‌కు అబ‌ద్ధాలు చెప్తూ త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. అలాగే త‌న పార్టీ నాయ‌కుల‌తో అవే ప్ర‌చారం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఏమాత్రం ఆలోచ‌న ఉన్నా జ‌గ‌న్ అసెంబ్లీకి వ‌చ్చి మాట్లాడాల‌ని మంత్రి స‌వాల్ విసిరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>