Mobile Popup Ad
Mobile Popup Ad

గచ్చిబౌలి AMB ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ఇద్దరు మృతి!

కలం, వెబ్ డెస్క్ : గచ్చిబౌలి ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం (AMB Flyover Accident) జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని ఒక బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ రోజు ఉదయం సుమారు 7:25 గంటల సమయంలో గచ్చిబౌలి ఏఎంబీ ఫ్లైఓవర్‌పై (AMB Flyover Accident) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక స్కూటీ రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకువచ్చింది. అదే సమయంలో ఫ్లైఓవర్‌పై వస్తున్న బుల్లెట్ బైక్ దానిని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మరణించారు. మృతులను శ్రీకాంత్, విఠల్‌గా పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్ నడుపుతున్న వినోద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లోని ఫ్లైఓవర్లపై తరచూ అనేక వాహనాలు రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తుంటాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ముందుగానే స్పందించి ఇలా రాంగ్ రూట్‌లో వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే, ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

Read Also:  నిజామాబాద్ లో ‘హస్త’వ్యస్తం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>