కలం, నిర్మల్ : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ( Nirmal ) జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో చెల్లించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, ప్రజాసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

