Mobile Popup Ad
Mobile Popup Ad

పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగి తీగ చోరి చేస్తున్న ముఠా అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో: పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగ చోరికి పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ (ACP Vasundhara Yadav) తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా (Khammam) వీఎం బంజర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వీఎమ్ బంజర ఎస్సై వెంకటేష్ ఉదయం లంక సాగర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, సత్తుపల్లి నుంచి తిరువూరు వైపు వస్తున్న రెండు అనుమానస్పద మోటార్ సైకిళ్లు కనిపించాయని తెలిపారు. వాటిని ఆపి చెక్ చేసి రాగి తీగల కట్టలు గుర్తించారన్నారు. నిందితుల నుంచి 200 కేజీల రాగి తీగ, రెండు వ్యవసాయ మోటార్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు.

విచారణలో ప్రధాన నిందితుడైన చల్ల.దశరథ్, మరో ముగ్గురుతో కలసి (అల్లం శివ, ముల్లగిరి రామక్రిష్ణ, ముదరబోయిన ఏడుకొండలు) ఒక ముఠాగా ఏర్పడి పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ దొంగిలించి అశ్వరావుపేటలో అమ్మి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తారని తేలిందన్నారు. అయితే ఇటీవల అశ్వరావుపేట స్క్రాప్ షాపుల దగ్గర నిఘా పెరగడంతో, తిరువూరు వెళ్ళే ప్రయత్నంలో వి.ఏం బంజర్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేశారని ఏసిపి వివరించారు. అలాగే రైతులకు అసౌకర్యం కలిగించడంతో పాటు, భయబ్రాంతులకు గురి చేసిన కారణంగా వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఏసీపీ వసుంధర యాదవ్ అభినందించారు.

Read Also: ‘విమానాలు ఆపేస్తాం’.. ఎయిర్‌లైన్స్ సంస్థల హెచ్చరిక

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>