హైదరాబాద్‌లో పెట్రోల్ కొరత వార్తలపై కలెక్టర్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా వాహనాల క్యూలే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకులు తెరవకముందే వాహనదారులు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కొరత ఉందన్న ప్రచారంతో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల (Priyanka Ala) కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో పెట్రోల్ కొరత లేదని.. ఇందన సరఫరా స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. ఎర్నర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతపై సమీక్షించారు. నిల్వల స్థాయి, సరఫరా, క్షేత్ర స్థాయి పంపిణీ పరిస్థితులను పరిశీలించారు. నిరంతర సరఫరా కొనసాగించేలా అధికారులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

వదంతులు నమ్మొద్దు

ప్రజలు వదంతులను నమ్మకుండా, ఆందోళనతో అధికంగా కొనుగోలు చేయొద్దని కలెక్టర్ (Priyanka Ala) సూచించారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ పెరుగుదల కొరత కారణంగా కాదు, భయాందోళనల వల్లేనని తెలిపారు. అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనం కొనుగోలు చేసి, అధికారిక సమాచారం మీదే విశ్వాసం ఉంచాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు.

Read Also: ‘విమానాలు ఆపేస్తాం’.. ఎయిర్‌లైన్స్ సంస్థల హెచ్చరిక

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>