సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై MCHRDలో మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అందరూ మంత్రులు హాజరు కాబోతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని భూములు నిషేధిత జాబితాలో ఉండేవి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఎకరాలను తొలగించిందనే అంశాలపై పూర్తి స్పష్టత ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత భూముల అంశం పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా సమావేశం నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన..

నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్యూర్ పరిధిలో ఒకేసారి 25 వేలకు పైగా ఇళ్లను నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించబోతున్నట్లు సమాచారం. అంతేగాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. ఎలాంటి వివాదాలు లేని ఇళ్లు, ఇతర నిర్మాణాలు 22ఏలో ఉంటే.. వాటిని తొలగించే కార్యక్రమం శరవేగంగా చేపట్టబోతున్నట్లు చర్చ జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>